epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఆ ఊరి పేరు పలుకలేం.. మార్చాలని ఎమ్మెల్యే డిమాండ్

కలం, వెబ్ డెస్క్: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే (Sirpur MLA) పాల్వాయి హరీశ్‌బాబు ఓ కీలక‌మైన డిమాండ్‌ను అసెంబ్లీలో సభ ముందు ఉంచారు. కాగజ్‌నగర్ సమీపంలోని ఓ గ్రామం పేరు మార్చాలని ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. సదరు గ్రామం పేరు పలుకలేని స్థితిలో ఉందని.. అందుకే రికార్డుల్లో మార్చేయాలని హరీశ్‌ బాబు (Sirpur MLA) కోరారు. కాగజ్‌నగర్ సమీపంలోని ఓ గ్రామానికి ఉన్న ల.. గూడ అనే ఉంది. రెవెన్యూ రికార్డుల్లోనూ ఇదే పేరు ఉంది. దీంతో చాలా రోజులుగా ఆ గ్రామ ప్రజలు పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామ ప్రజలు గ్రామం పేరును నందిగూడగా మార్చుకున్నారు. కానీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం మారలేదు. దీంతో ఎమ్మెల్యే హరీశ్ బాబు సభలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరి ఎమ్మెల్యే అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకుంటుందా? ఆ ఊరి పేరును మారుస్తుందా? అన్నది వేచి చూడాలి. ఎమ్మెల్యే అసెంబ్లీలో ఈ డిమాండ్‌ను తెరమీదకు తీసుకురావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>