కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswarm Project) కట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు తన పేరును గోబెల్స్ అని మార్చుకోవాలన్నారు. బీఆర్ఎస్ నేతలు సిగ్గుతో తలదించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు అతి తెలివితేటలు వాడడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. గత పాలకులు తెలంగాణ ప్రజల తలలను తాకట్టు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులను కాంగ్రెస్ కట్టిందని ఉత్తమ్ గుర్తు చేశారు. కాళేశ్వరం ద్వారా ఐదేళ్లలో కేవలం 70 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉపయోగించారని చెప్పారు. కృష్ణా(Krishna River) జలాల విషయంలో 2014 నుంచి 2020 వరకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేసీఆర్(KCR) సంతకాలు పెట్టారని గుర్తు చేశారు. పాలమూరు, డిండి, ఎస్ఎల్బీసీ(SLBC) ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రజలను కేసీఆర్ మోసం చేశాడని మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) దుయ్యబట్టారు.
Read Also: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు సవాల్
Follow Us On: Youtube


