కలం, వెబ్‌డెస్క్: ఈ ఏడాది రాజధాని నగరంలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 4,414 కేసులు ఎక్కువ రికార్డయ్యాయి. ముఖ్యంగా కిడ్నాపులు, మహిళలపై వేధింపులు, పోక్సో కేసుల్లో పెరుగుదల కనిపించింది. అలాగే భౌతిక దాడులు, దూషణలు వంటి స్వల్ప కేటగిరీ కేసులూ పెరిగాయి. ఈ మేరకు 2025కు సంబంధించిన క్రైమ్ రేట్ (Rachakonda Police Report) వివరాలను రాచకొండ సీపీ సుధీర్‌బాబు(CP Sudheer Babu) సోమవారం వెల్లడించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక విడుదల చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం 2025లో క్రైమ్ కేసుల సంఖ్య పెరిగింది. గత సంవత్సరం అన్ని రకాల కేసులు కలిపి 28,626 నమోదవగా; ఈ ఏడాది 33,040 కేసులు రికార్డయ్యాయి. నివేదిక ప్రకారం ఈ ఏడాది నమోదైన వివిధ కేసులు ఇలా ఉన్నాయి.
కేసు 2024 లో 2025లో
స్వలాభం కోసం హత్యలు 5 3
దోపిడీలు 118 67
వాహనాల దొంగతనం 1086 876
హత్యలు 73 73
అత్యాచారం 384 330
గృహహింస 1222 782
బందిపోటు దొంగతనాలు 4 2
ఇళ్లలో దొంగతనాలు 633 589
సాధారణ దొంగతనాలు 1310 1161
కిడ్నాపులు 463 579
వరకట్న హత్యలు 18 12
లైంగిక వేధింపులు, పోక్సో 953 1224
దూషణలు/దాడులు/ఇతరత్రా 22357 27342

Read Also: ప్రజల తలలను తాకట్టు పెట్టి కాళేశ్వరం కట్టారు : ఉత్తమ్
Follow Us On: X(Twitter)


