Mobile Popup Ad
Mobile Popup Ad

ట్రంప్ ఆహ్వానం.. త్వరలోనే అమెరికాకు ప్రధాని మోదీ?

కలం, వెబ్ డెస్క్: భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ప్రధాని మోదీని (PM Modi) మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరు దేశాల మధ్య కీలక రంగాల గురించి చర్చించారు. వ్యూహాత్మక సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, ఎనర్జీ సెక్యూరిటీ, విద్య తదితర అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా, వైట్ హౌస్ సందర్శనకు రావాలని అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేకంగా కోరారని రుబియో చెప్పగా.. అందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. సమీప భవిష్యత్తులో మోదీ అమెరికా పర్యటన ఉండే అవకాశం ఉందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ప్రకటించారు.

ఇండియా–అమెరికా కలిసి పనిచేస్తాయి: ప్రధాని మోదీ

మార్కో రుబియోతో (Marco Rubio) సమావేశంపై ప్రధాని మోదీ (PM Modi) కీలక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘అమెరికా–భారత్ వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యం, ప్రాంతీయ ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని పరిస్థితులను చర్చించడంతో పాటు శాంతి, భద్రత గురించి సమీక్ష చేశాం. ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాలు ఇక ముందు కూడా కలిసే పనిచేస్తాయి. ఘర్షణలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలి’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Read Also: కపుల్స్ మధ్య గొడవలకు ఇలా ఫుల్‌స్టాప్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>