Mobile Popup Ad
Mobile Popup Ad

అమెరికా ఇరాన్ సంచలనం: శాంతి ఒప్పందానికి సిద్ధం!

కలం, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ అమెరికా, ఇరాన్ (US Iran) దేశాల మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందానికి రంగం సిద్ధమైంది. ఇరు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా సాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఏ క్షణంలోనైనా ఈ చారిత్రాత్మక ఒప్పంద ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. పాకిస్తాన్ దౌత్యవేత్తల సమక్షంలో రూపొందిన ఈ శాంతి ఒప్పంద ముసాయిదా మరో కొన్ని గంటల్లోనే అధికారికంగా ప్రపంచానికి తెలిసేలా వ్యూహం రచించారు. ఇందులో భాగంగా భూమి, ఆకాశం, సముద్ర మార్గాలన్నింటిలో తక్షణమే పూర్తిస్థాయి సంపూర్ణ కాల్పుల విరమణ అమలు చేయనున్నారు. పరస్పర సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలు, ఆర్థిక మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు చేయబోమని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి.

ఈ కీలక పరిణామాల నేపథ్యంలో టెహ్రాన్ నగరంలో పాక్ సైన్యాధిపతి, ఖతార్ దౌత్య బృందం గంభీరంగా చర్చలు జరుపుతున్నారు. ఒప్పందం కోసం ఇరాన్ ఎంతో ఆరాటపడుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అంతకుముందు శ్వేతసౌధంలో తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఇరాన్ వైఖరిపై శ్వేతసౌధం ముందుగా ఒక కఠిన వ్యూహాన్ని సైతం సిద్ధం చేసింది. అమెరికా పంపిన తుది ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించకపోతే కొత్తగా వైమానిక దాడులు చేయాలని ట్రంప్ యోచించారు.

దీనిపై ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్ లతో కలిసి ట్రంప్ ఉన్నత స్థాయి జాతీయ భద్రతా సమావేశాన్ని నిర్వహించారు. చర్చల వైఫల్య సినారియోలను కూడా ఈ సమావేశంలో నిశితంగా సమీక్షించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా అధ్యక్షుడు ట్రంప్ తన పెద్ద కుమారుడి వివాహ వేడుక ప్రయాణాన్ని సైతం రద్దు చేసుకుని వాషింగ్టన్ లోనే ఉండిపోయారు. చివరి నిమిషంలో ఇరాన్ సానుకూలంగా స్పందించడంతో ఇప్పుడు యుద్ధ మేఘాలు తొలగి శాంతి ఒప్పందం వైపు అడుగులు పడ్డాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>