కలం, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లా పూతలపట్టు (Puthalapattu) నియోజకవర్గంలో నేడు (మే 23) ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) పర్యటించనున్నారు. యాదమరి గ్రామంలో నిర్వహించనున్న “సంజీవిని” కార్యక్రమానికి (Sanjeevani Programme) సీఎం హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఆరోగ్య సేవల విస్తరణపై సమీక్షించనున్నట్లు సమాచారం. అలాగే స్థానిక ప్రజలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రామం, పరిసర ప్రాంతాలలో పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరు కానున్నారు.

