Mobile Popup Ad
Mobile Popup Ad

ఇక బాంబ్ ల వర్షమే.. డొనాల్డ్ ట్రంప్ డెడ్లీ వార్నింగ్

కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇరాన్ (US – Iran) మధ్య ప్రస్తుతం అమలులో ఉన్న రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ఈ బుధవారంతో ముగియనుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో రెండు దేశాల మధ్య రెండో దఫా శాంతి చర్చలు జరగనున్నాయి. అయితే ఇరాన్ రెండో దఫా చర్చలకు ససేమిరా అనడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ శాంతి చర్చలకు సుముఖంగా లేకపోతే టెహ్రాన్ వేదికగా బాంబ్ ల వర్షం కురుస్తుందని హెచ్చరించారు. పీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. కాల్పుల విమరణ ఒప్పందంను పొడిగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఇటీవల పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన తొలి విడత శాంతి చర్చలు విఫలయ్యాయి. ఇరు దేశాల మధ్య ఎటువంటి అంగీకారం కుదరలేదు. ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లో అణ్వాయుధాలు తయారు చేయకూడదని.. హర్మూజ్ (Strait of Hormuz) దిగ్భందనం తొలగించాలని అమెరికా కోరుతుంది. కానీ దీనికి ఇరాన్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు అమెరికా యుద్ధ పరిహారం చెల్లించాలని.. ఇరాన్ మీద ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయాలని, విదేశాల్లో  ఫ్రీజ్ చేసిన ఇరాన్ డబ్బులను చెల్లించాలని అమెరికాను ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దీనికి అమెరికా సమ్మతించడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య చర్చల విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) తాజా హెచ్చరిక హాట్ టాపిక్ గా మారింది. మరి ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ స్పందిస్తుందా? ఇరాన్ రెండో దఫా చర్చలకు అంగీకరిస్తుందా? లేదా ? అనేది ఆసక్తికరంగా మారింది.

Read Also: అజారుద్దీన్‌కు లైన్ క్లియర్ ?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>