Mobile Popup Ad
Mobile Popup Ad

హుజురాబాద్‌లో వికలాంగులకు ట్రై మోటరైజ్డ్ స్కూటీలు పంపిణీ

కలం, కరీంనగర్ బ్యూరో : హుజురాబాద్ (Huzurabad) పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్‌లో వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ట్రై మోటరైజ్డ్ స్కూటీలు, ఎలక్ట్రిక్ ఆటోలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ చేతుల మీదుగా వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వికలాంగుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 8000కు పైగా ఉపకరణాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 1500 స్కూటీలు మాత్రమే ఇవ్వగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే సంవత్సరంలో 2000 ట్రై మోటరైజ్డ్ స్కూటీలు అందజేసిందని వివరించారు. ఈ వాహనాలు వికలాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా, ఆర్థికంగా నిలదొక్కుకునేలా సహాయపడతాయని తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. వాహనాలు పొందిన లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Read Also: రీల్స్ పిచ్చితో ప్రాణం తీసుకున్నాడు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>