కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2026 సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. క్రికెట్ లవర్స్ మ్యాచ్‌లను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలామందికి స్టేడియంలో మ్యాచ్ చూడాలని ఎంతో ఆశగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో మ్యాచ్ ఉండటం, లేదా టైం కుదరకపోవడం, టికెట్ల ఖర్చుతో కొందరు స్టేడియంలో మ్యాచ్‌లను మిస్ అవుతూ ఉంటారు. ఇక ఇటీవల సొంత రాష్ట్రంలో ఉప్పట్ స్టేడియం (Uppal Stadium)లో మ్యాచ్‌లు ఉన్నప్పుడు, టికెట్ కొనుక్కొని కూడా మ్యాచ్ మిస్ అయిన వారూ ఉన్నారు. దీనికి కారణం కొన్ని నిషేధిత వస్తువులను వెంట తీసుకెళ్లడమే.
గత నెల మార్చి 23న సన్ రైజర్స్ హైదరాబాద్(SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడ్డ మ్యాచ్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌కు వచ్చిన వాళ్లకు పోలీసులు షాకిచ్చారు. కొన్ని నిషేధిత వస్తువులను తీసుకొచ్చిన వారికి ఎంట్రీ నిరాకరించారు. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ షాకయ్యారు. అదేంటి గతంలో వీటిని అనుమతించారు కదా.. అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ఈసారి మల్కాజిగిరి పోలీసులు ఐపీఎల్ మ్యాచ్‌లకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు వస్తువులను లోపలికి అనుమతించడం లేదు.
నిషేధిత వస్తువులు ఇవే…
పోలీసులు నిషేధించిన వస్తువుల్లో ప్రధానంగా కెమెరాలు, ఇతర రికార్డింగ్ పరికరాలు, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, ఇయర్ పాడ్స్ వంటివి ఉన్నాయి. వీటితో పాటు సిగరెట్, లైటర్, మ్యాచ్ బాక్స్, మద్యానికి కూడా అనుమతి లేదు. అలాగే తుపాకీలు, కత్తులతో పాటు ఇతర ఆయుధాలు, బయటి నుంచి తెచ్చే తినుబండారాలు, వాటర్ బాటిళ్లు, మద్యం, పెంపుడు జంతువులు, హ్యాండ్ బ్యాగ్‌లు, లగేజీ బ్యాగులు, ల్యాప్ ట్యాప్స్, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్, బైనాకులర్స్, ఫైర్ క్రాకర్స్, డ్రగ్స్ తదితర వస్తువులను లోపలికి అనుమతించబోరు. మ్యాచ్ చూసేందుకు వచ్చే వారు ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో వెంట తీసుకురావొద్దని పోలీసులు సూచిస్తున్నారు. స్టేడియం (Uppal Stadium) వద్ద వస్తువులు పెట్టుకోవడానికి క్లాక్ రూం కూడా లేదని చెప్తున్నారు. అలాగే మ్యాచ్ ప్రారంభయ్యేందుకు రెండు మూడు గంటల ముందే స్టేడియంకు చేరుకుంటే రద్దీ నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు.
Read Also: పశ్చిమాసియా యుద్ధం.. పోప్, ట్రంప్ మధ్య డైలాగ్ వార్
Follow Us On: Instagram

