Mobile Popup Ad
Mobile Popup Ad

పశ్చిమాసియా యుద్ధం.. పోప్, ట్రంప్ మధ్య డైలాగ్ వార్

కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధాన్ని (West Asia War)  పోప్ లియో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్.. పోప్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలోనే పశ్చిమాసియా యుద్ధం వేళ వైట్ హౌస్, వాటికన్ సిటీ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది.

పశ్చిమాసియా యుద్దంపై పోప్ లియో స్పందిస్తూ.. తనకు ట్రంప్ అంటే భయం లేదని అన్నారు. తాను యుద్దానికి వ్యతిరేకంగా గళం విప్పుతూనే ఉంటానని స్పష్టం చేశారు. సమస్యలకు న్యాయపరమైన పరిష్కరం కనుగొనడానికి దేశాల మధ్య సంభాషణను ప్రోత్సాహిస్తానని తేల్చి చెప్పారు. యుద్ధం వల్ల ఎంతో మంది అమాయకులు చంపబడుతున్నారని, చాలా మంది బాధను అనుభవిస్తున్నారని తెలిపారు. ప్రపంచ నాయకులు హింసకు తావు ఇవ్వకుండా శాంతి దిశగా అడుగులు వేయాలని పరోక్షంగా ట్రంప్ ను ఉద్దేశిస్తూ సూచనలు చేశారు.

దీంతో పోప్ లియోపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శలకు దిగారు. పోప్ లియో.. నేరాల విషయంలో బలహీనుడు, విదేశాంగ విధానంలో ఘోరమైనవాడు అని విమర్శలు గుప్పించారు. తాను ఏ పని కోసం ఎన్నికయ్యానో.. అదే పనిని భారీ మెజార్టీతో చేస్తున్నానని అన్నారు. పోప్ పదవికి సంబంధించిన ఏ జాబితాలోనూ ఆయన పేరు లేకున్నా.. కేవలం అమెరికన్ అయ్యినందువల్ల పోప్ లియో ఇప్పుడు పోప్ గా వ్యవహరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే అమెరికాను విమర్శించే పోప్ తనకు వద్దు అంటూ వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా యుద్ధం (West Asia War) వేళ వైట్ హౌస్, వాటికన్ సిటీ మధ్య డైలాగ్ వార్ ఉద్రిక్తతలకు దారి తీస్తుంది.

Read Also:  జగిత్యాలలో కేసీఆర్ స‌భ‌.. కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>