Mobile Popup Ad
Mobile Popup Ad

ఫిరాయింపు ఎమ్మెల్యేపై ఫుల్ ట్రోల్స్

కలం, వెబ్ డెస్క్: ఫిరాయింపు ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ(Arikepudi Gandhi)కి సొంత నియోజకవర్గంలో వినూత్న నిరసన ఎదురైంది. బీఆర్ఎస్ నేతలు ఆయనను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన గాంధీ.. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు అతడిని లక్ష్యంగా చేసుకొని నియోజకవర్గంలో పోస్టర్లు పెడుతున్నారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీల్లో ఆరికెపూడి గాంధీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే పార్టీ మారారు కానీ.. తమ నియోజకవర్గ పరిస్థితి మారలేదంటూ ఫ్లెక్సీల్లో రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రైనేజీ పనులు పూర్తి చేయడంలో ఎమ్మెల్యే అలసత్వం వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచేందుకు శేరిలింగంపల్లిలో (Serilingampally) రోడ్లు తవ్వి నెలలు గడిచిపోయినా పనులు ఇంకా పూర్తి కాలేదని స్థానికులు చెబుతున్నారు. తవ్విన రోడ్ల కారణంగా రాకపోకలు ఇబ్బందికరంగా మారడమే కాకుండా, మురుగు నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన, దోమల సమస్యలు ఎక్కువయ్యాయని వాపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. “నువ్వు పార్టీలు మారావు? మరి మా బస్తీల పరిస్థితి మారేదెప్పుడు?” అంటూ అసంపూర్తిగా ఉన్న డ్రైనీజీల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు. గాంధీ (Arikepudi Gandhi) బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారని.. గత పదేండ్లు ఆయన ఆ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా శేరిలింగం నియోజకవర్గంలో ఫ్లెక్సీల రాజకీయం నడుస్తోంది.

Read Also: ‘సర్’పైనే అన్ని పార్టీల ఫోకస్.. ఏజెంట్ల నియామకంలో బిజీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>