ఆరు గ్యారంటీలు అమలైనట్లు నిరూపిస్తే ఉరేసుకుంటా : ఎమ్మెల్సీ మధుసూదనాచారి

కలం, వరంగల్ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు (Six Guarantees) అమలు చేశానని చూపిస్తే హనుమకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానని ఎమ్మెల్సీ సిరికొండ మ‌ధుసూద‌నాచారి (MLC Madhusudanachari ) కీలక వ్యాఖ్యలు చేశారు. హనుమకొండలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎం అనే స్థాయిని మర్చిపోయి కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో ముఖ్య నేతగా ఉన్న విజయన్ పై మాట్లాడే స్థాయి రేవంత్ కి లేదన్నారు. శాసన మండలిలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ మీద చర్చ, పద్దులపై చర్చలు అత్యంత ప్రధాన అంశాలు.. ఆ అంశాల మీద చర్చ సమయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళాడని విమర్శించారు. శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లిలో స‌భ్యుల అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలే క‌రువ‌య్యాయన్నారు. స‌భ‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హణ, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు, కట్టిన తర్వాత రాష్ట్రంలో పంటల దిగుబడి ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు.

కాళేశ్వరం (Kaleshwaram) ద్వారా ల‌క్ష కోట్లు నీళ్ల పాలు అయ్యాయ‌ని పార్లమెంట్ లో నెగటివ్ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రికి తన శాఖపై అవగాహన లేదని మాజీ స్పీకర్ (MLC Madhusudanachari ) ఎద్దేవా చేశారు. వరి ఉత్పత్తిలో 2023 నాటికి దేశంలోనే తెలంగాణ నంబ‌ర్ 1 అవడానికి కాళేశ్వరం కారణం అని చెప్పారు. తెలంగాణ రైతుల ఆత్మ‌హ‌త్య‌లు జ‌రుగుతున్న‌వి నిజం కాదా అని ప్రశ్నించారు. శనివారం గ‌జ్వేల్ క్యాంపు కార్యాల‌యంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ ఆఫీస్ లో మోడీ ఫోటో పెడుతున్నారా అని కాంగ్రెస్ నాయకులను ఆయన ప్రశ్నించారు. అలాగే, మేడారంలో యువన్ అనే బాలుడికి గాయం కావడం వల్ల కాలు తీసేశారని.. దీనికి మేడారంలో చేసిన నాసి రకం పనులే కారణమన్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదు.. ప్రజా పీడన లా ఉన్నదని మధుసూధనాచారి విమర్శించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, సాంబారి సమ్మారావు, కార్పొరేట‌ర్ బొంగు అశోక్ యాద‌వ్‌, మాజీ కార్పొరేట‌ర్లు జోరిక రమేశ్‌, ఏలిమి స‌తీష్‌, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ క‌న్విన‌ర్ తాళ్ల‌ప‌ల్లి జ‌నార్ధ‌న్ గౌడ్‌, కో ఆర్డినేట‌ర్ పులి ర‌జినీకాంత్ ముదిరాజ్‌, సీనియ‌ర్ నాయ‌కులు, మైనార్టీ సెల్ జిల్లా అధ్య‌క్షులు న‌యీమొద్దీన్‌, స‌ల్వాజి ర‌వీంద‌ర్ రావు, పార్టీ డివిజ‌న్ అధ్య‌క్షులు కొడ‌కండ్ల స‌దాంత్‌, పున్నం చంద‌ర్‌, నాయ‌కులు పానుగంటి శ్రీ‌ధ‌ర్‌, జాన‌కి రాములు, రామ్మూర్తి, సుద‌ర్శ‌న్‌, సారిక‌, సౌరం ర‌ఘు, గండ్ర‌కోట రాకేష్ యాద‌వ్‌, దొమ‌కుంట్ల రాజ్‌కుమార్‌, పుల్ల‌య్య‌, మూటిక రాజు యాద‌వ్‌, సురాసి మ‌హేష్‌, సంప‌తి ర‌ఘు, న‌వీన్‌, విజ‌య్ రెడ్డి, త‌క్క‌ళ్ల‌ప‌ల్లి వినీల్ రావు, మంద సృజ‌న్ కుమార్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Read Also: బెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ కీలకహామీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>