కలం, వెబ్ డెస్క్: దేశంలో ఇప్పటివరకు 7 బుల్లెట్ ట్రైన్ (Bullet Train) కారిడార్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఒక్క మహారాష్ట్రలోనే రూ.2 లక్షల కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులు మంజూరైనట్లు వివరించారు. వీటిలో ఇప్పటికే ముంబయి–అహ్మదాబాద్ మార్గం శరవేగంగా నిర్మాణం జరుగుతోందన్నారు. వచ్చే ఏడాది నాటికి పూర్తవుతుందని తెలిపారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుల రాకతో రైల్వే రంగంలో గణనీయ మార్పులు రాబోతున్నాయని.. శరవేగంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో బుల్లెట్ ట్రైన్లు పరుగులు తీయబోతున్నట్లు స్పష్టం చేశారు.
7 కారిడార్లు ఇవే..
• ముంబయి–అహ్మదాబాద్: ప్రయాణ సమయం గంట 57 నిమిషాలు
• ముంబయి–పుణే: 48 నిమిషాలు
• పుణే–హైదరాబాద్: 2 గంటల 8 నిమిషాలు
• బెంగళూరు–చెన్నై: గంట 13 నిమిషాలు
• బెంగళూరు–హైదరాబాద్: రెండు గంటల 10 నిమిషాలు
• ఢిల్లీ–లక్నో: రెండు గంటలు
• ఢిల్లీ–వారణాసి: 3 గంటల 15 నిమిషాలు
• ఢిల్లీ–సిలిగుడి: 6 గంటలు
Read Also: ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈసారి తప్పు చేయొద్దు: రాహుల్ గాంధీ
Follow Us On: Instagram

