Mobile Popup Ad
Mobile Popup Ad

మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణ.. గాంధీ భవన్‌లో సత్యాగ్రహ దీక్ష

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించిన తీరుకు నిరసనగా, గాంధీ భవన్‌లో కాంగ్రే శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆల్ ఇండియా చైర్మన్ సునీల్ పన్వర్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ హాజరై తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ పాలన అడ్డూ అదుపు లేకుండా సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan) నామినేషన్‌ తిరస్కరణ తీరు చూస్తే.. మోడీ దుర్మార్గం అర్థం అవుతుందన్నారు. కేసు లేదు.. ఎఫ్‌ఐఆర్‌ లేదు.. అలాంటి రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను ఉరి తీసినా తప్పులేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యే అంశం ఏమీ లేదని చెప్పుకొచ్చారు.

Read Also: ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈసారి తప్పు చేయొద్దు: రాహుల్ గాంధీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>