కలం, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు.. గ్యాస్ కొరత నేపథ్యంలో భారత్‌లో లాక్‌డౌన్ (Lockdown) విధిస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన నేడు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. దేశంలో లాక్‌డౌన్ పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని, అటువంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఇంధనం, విద్యుత్, నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు.
అనవసరమైన పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. శాంతియుతంగా, బాధ్యతాయుతంగా ఉండాలని మంత్రి హర్దీప్ (Hardeep Singh Puri) విజ్ఞప్తి చేశారు. క్లిష్ట సమయాల్లో ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని, ఇది సమాజానికి హానికరమని ఆయన పేర్కొన్నారు. దేశం ఎదుర్కొనే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సప్లై చైన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.
Read Also: రామ్ చరణ్ బర్త్‌డే.. పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్!
Follow Us On : WhatsApp

