కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలోని ఇల్లందు (Yellandu) మండలంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఇల్లందు మండలం సత్యనారాయణపురం ఒకటవ వార్డులో ఉన్న హజరత్ నాగుల్ మీరా దర్గాలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్లో ఒక ఉడుత(Squirrel) విశిష్ట అతిథిగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ దర్గాలో హిందూ, ముస్లిం భక్తులు కలిసి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. దర్గాలో దమ్మక్క విగ్రహంతో పాటు సీతారాముల ప్రతిమలను కూడా ప్రతిష్టించి, సీతారాముల కళ్యాణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ప్రత్యేకత.
ఈ ఏడాది కూడా వేడుకల సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసిన పలహారాలను ఒక ఉడుత వచ్చి భుజించడం అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా, ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉడుత రావడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. దీనిని భక్తులు పవిత్ర సంకేతంగా భావిస్తున్నారు. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఘటన స్థానికంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
-దర్గాలో సీతారాముల కల్యాణం.. ఫలహారాన్ని స్వీకరించిన ‘ఉడుత’
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని నాగుల్ మీరా దర్గాలో హిందూ-ముస్లింలు కలిసి వైభవంగా జరిపిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
-అక్కడికి ఒక ఉడుత వచ్చి స్వామివారి కోసం చేసిన ఫలహారాన్ని స్వీకరించడం అందరిని… pic.twitter.com/gqkRo5P204— Kalam Daily (@kalamtelugu) March 27, 2026
Read Also: ఇరాన్‌పై దాడులపై ట్రంప్ మరో కీలక నిర్ణయం!
Follow Us On: Instagram

