Mobile Popup Ad
Mobile Popup Ad

రామ్ చరణ్ బర్త్ డే .. చిరూ స్పెషల్ ట్వీట్

కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన రామ్ చరణ్ (Ram Charan) అతి తక్కువ కాలంలో గ్లోబల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే.. ఈ సందర్భంగా అభిమానులు చరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. అలాగే చరణ్‌కు తండ్రి చిరంజీవి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు.

చరణ్ బాబు (Chiranjeevi).. చిన్నప్పుడు నా చెయ్యి పట్టుకుని నడిచిన నువ్వు, ఈరోజు లక్షల మందికి ప్రేరణగా నిలిచావు. నన్ను ఎంతగానో గర్వపడేలా చేశావు. సినిమా, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసే నీ తీరు, కుటుంబంపై బాధ్యత, దేవుడిపై విశ్వాసం, నీ క్రమశిక్షణ, విలువలు.. ఇవన్నీ చూస్తుంటే నిన్ను మరింతగా ప్రేమించాలనిపిస్తుంది. దేవుని ఆశీస్సులు, అభిమానుల ప్రేమ నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని చిరంజీవి ట్వీట్ చేశారు.

Read Also: రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే.. పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేసిన మేక‌ర్స్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>