కలం, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్‌డే సందర్భంగా టాలీవుడ్ నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి, బాబాయి పవన్ కల్యాణ్‌లు సోషల్ మీడియా వేదికగా ఆయనకు విషెస్ తెలిపారు. మరోవైపు రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ది (Peddi) టీం ఆయన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే ట్రీట్ ఇచ్చింది. పెద్ది మూవీ నుంచి రామ్‌చరణ్ గ్లింప్స్ విడుదల చేసింది. ఇందులో కండలు తిరిగిన దేహంతో రామ్ చరణ్ ఉస్తాద్‌లా కనిపిస్తున్నాడు.
పెద్ది అంటే బంతితో బ్యాట్‌కు ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట అంటూ చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. పెద్ది అంటే.. క్రికెట్టే కాదు. చాలా ఆటలే ఉంటాయి. అందులో కుస్తీ కూడా అంటూ మూవీ టీం అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇప్పటి వరకు పెద్ది క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అనుకున్నారు. కానీ, పెద్ది గ్లింప్స్‌లో ‘కుస్తీ’ పై ఫోకస్ చేశారు. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, లుక్ మెస్మరైజింగా ఉన్నాయి. ఇక ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ ఖాయమంటూ మరోసారి నిర్మాతలు రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోతున్నారు.

