epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కార్మికులకు కేంద్ర గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా నాలుగు చట్టాలు

New Labour Reforms | దేశంలోని అన్ని రంగాల కార్మికులకు మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి మేలు చేసేలా కొత్త చట్టాలను రూపొందించింది. మారుతున్న కాలం కారణంగా గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను కలిపేసి నాలుగు చట్టాలుగా మార్చారు. ఇది దేశంలో జరిగిన అతిపెద్ద లేబర్ రిఫార్మ్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు–నియోజకుల మధ్య పారదర్శకత లేకపోవడం, సంక్లిష్ట నియమాలు, బ్యూరోక్రటిక్ అవరోధాలు, న్యాయం పొందడం కష్టతరంగా మారడం, అసంస్థీకృత రంగంలో కార్మికులకు రక్షణ లేకపోవడం వంటి సమస్యలు పెరిగిపోవడంతో సంస్కరణల అవసరం ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. కోడ్ ఆఫ్ వేజెస్ (2019), ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ (2020), సోషల్ సెక్యూరిటీ కోడ్ (2020), ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ (2020) అనే నాలుగు సమగ్ర చట్టాలను కేంద్రం ప్రవేశపెట్టింది. వీటి లక్ష్యం ఉద్యోగులకు భద్రత, వినియోగదారులకు పారదర్శకత, కంపెనీలకు సౌకర్యం, ఆర్థిక రంగానికి స్థిరత్వం. వాటి వివరాలు ఇవే..

New Labour Reforms : 

1) వేతన కోడ్ – 2019 (Code on Wages, 2019)

భారతదేశం మొత్తం మీద వేతన వ్యవస్థను సమీకరించడం, కనీస వేతనాన్ని అన్ని రంగాలకు అందించడం ఈ చట్టం లక్ష్యం.

దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరికీ కనీస వేతనం హామీ.

జీతం ఆలస్యం కాకుండా టైమ్‌–బౌండ్ పేమెంట్ రూల్స్.

బోనస్, ఓవర్‌టైమ్, డిడక్షన్స్ పై ఒకే విధమైన స్పష్టమైన నిబంధనలు.

షెడ్యూల్డ్ ఇండస్ట్రీస్ అనే పాత వర్గీకరణ రద్దు.

వేతనం డిజిటల్ / బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఇవ్వాలి.

కనీస వేతనం నిర్ణయానికి కేంద్ర–రాష్ట్రాల మధ్య సమన్వయం తప్పనిసరి.

సారాంశం: భారత్‌లో ‘సమాన పనికి సమాన వేతనం’ భావన బలపడింది.

2) పారిశ్రామిక సంబంధాల కోడ్ – 2020 (Industrial Relations Code, 2020)

ఉద్యోగులు–నియోజకుల మధ్య సంబంధాలను మెరుగుపరచడం, పారిశ్రామిక వివాదాలను సత్వరంగా పరిష్కరించడం ఈ చట్టం లక్ష్యం.

ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్స్‌ వ్యవస్థ బలోపేతం.

300 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలకు స్టాండింగ్ ఆర్డర్స్ తప్పనిసరి.

సమ్మెలపై స్పష్టమైన నిబంధనలు—అనుమతులు లేకుండా సడన్ స్ట్రైక్‌లకు పరిమితులు.

ట్రేడ్ యూనియన్ గుర్తింపులో పారదర్శక పద్ధతి.

కంపెనీలు క్రమశిక్షణ చర్యలు తీసుకుపోయే విధానం స్పష్టీకరణ.

సారాంశం: సంస్థల్లో స్థిరత్వం పెరుగుతుంది, వివాదాలు వేగంగా పరిష్కారమవుతాయి.

3) సామాజిక భద్రత కోడ్ – 2020 (Code on Social Security, 2020)

సంస్థీకృత–అసంస్థీకృత, గిగ్–ప్లాట్‌ఫార్మ్ వర్కర్లతో పాటు అన్ని వర్గాల కార్మికులకు సామాజిక భద్రత అందించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం

PF, ESIC, గ్రాట్యుటీ, మేటర్నిటీ బెనిఫిట్స్ వంటి పాత చట్టాలన్నింటినీ ఒకే కోడ్‌లో కలిపారు.

తొలిసారిగా గిగ్ వర్కర్లకు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ వర్కర్లకు చట్టబద్ధమైన రక్షణ.

దేశవ్యాప్తంగా PF అమలు తప్పనిసరి.

ESIC పరిధి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరణ.

గ్రాట్యుటీ నిబంధనలు సడలింపు.

అనార్గనైజ్డ్ వర్కర్ల కోసం డేటాబేస్ మరియు ప్రత్యేక భద్రతా పథకాలు.

నిర్మాణ కార్మికులకు ప్రత్యేక రక్షణ.

సారాంశం: ఇప్పుడు దేశంలోని దాదాపు ప్రతి కార్మికుడికి సురక్షిత భవిష్యత్తు హామీ.

4) ఉద్యోగ భద్రత, ఆరోగ్యం & పని పరిస్థితుల కోడ్ – 2020 (OSHWC Code, 2020)

ప్రతి వ్యక్తి పని ప్రదేశం సురక్షితంగా ఉండేలా, ఆరోగ్య రక్షణ, ప్రాణ భద్రత ఏర్పాట్లు కచ్చితంగా అమలు చేయడం ఈ చట్టం ఉద్దేశం.

మహిళలకు రాత్రిపూట పని అనుమతి – అయితే లిఖితపూర్వక సమ్మతి తప్పనిసరి.

మహిళల భద్రత కోసం ప్రత్యేక సేఫ్టీ ప్రోటోకాళ్లు.

ఫ్యాక్టరీలు, మైన్స్, పోర్టులు వంటి హై–రిస్క్ రంగాలకు కఠిన భద్రతా నిబంధనలు.

40 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వార్షిక హెల్త్ చెక్‌.

పని ప్రదేశ ప్రమాదాల నిర్వహణ, ఎమర్జెన్సీ రిస్పాన్స్ కోసం ప్రత్యేక నిబంధనలు.

అన్ని అనుమతులు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు సింగిల్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే.

లేబర్ కోడ్స్‌కు కార్మిక సంఘాల వ్యతిరేకత

కేంద్రం తెచ్చిన నాలుగు కార్మిక చట్టాలను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇవి కంపెనీలకు అనుకూలంటా ఉన్నాయని ఆరోపించాయి. ‘‘ప్రభుత్వం వీటిని ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని అమలు చేయాలని చూస్తోంది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. ఈ చట్టాలన్నీ ప్రజాస్వామ్య సూత్రాలను ధిక్కరిస్తున్నాయి. ఇవి భారత సంక్షేమ స్వభావాన్ని శిథిలావస్థకు చేరుస్తాయి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Read Also: అమృతం సీరియల్ మళ్లీ వచ్చేస్తోంది

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>