epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అమృతం సీరియల్ మళ్లీ వచ్చేస్తోంది

అమృతం సీరియల్(Amrutham Serial) తెలియని ‘90s కిడ్స్’ ఉండరు. ఆ సీరియల్ అంతలా ప్రభావం చూపింది. ‘ఒరేయ్ ఆంజనేయులూ..! తెగ ఆయాసపడిపోకు చాలు… మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు’ అన్న టైటిల్ సాంగ్ వింటే అందరి మొహంలోనూ నవ్వులు పూస్తాయి. ఎన్నో జ్ఞాపకాలు మదిలో మెదులుతుంటాయి. అటువంటి సీరియల్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

2001లో ప్రారంభమైన ఈ కామెడీ సీరియల్‌ తెలుగు టెలివిజన్‌ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన షోగా నిలిచింది. ముఖ్యంగా ‘90s కిడ్స్’లో అమృతం అంటే ప్రత్యేకమైన అనుబంధం. ప్రతి ఆదివారం కుటుంబమంతా కూర్చొని చూసి కడుపుబ్బా నవ్వుకునే షో ఇదే. ‘అమృతం సీరియల్‌(Amrutham Serial)’ యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా నవంబర్‌ 24 నుంచి ప్రతి రోజూ రెండు ఎపిసోడ్‌లు విడుదల చేస్తామని సీరియల్‌ టీమ్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఒక ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తూ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. దీంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. అమృతం సీరియల్‌లో టైటిల్‌ పాత్ర ‘అమృతరావు’ పాత్రను ప్రారంభంలో శివాజీ రాజా పోషించారు. ఆ తర్వాత నరేశ్‌ ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రేక్షకులను అలరించారు. తరువాతి దశలో నటుడు హర్షవర్ధన్‌ అమృతరావుగా తనదైన శైలిలో నవ్వులు పంచారు.

పాత జ్ఞాపకాలను మళ్లీ తెరపైకి తీసుకురావడంతో పాటు, కొత్త తరం ప్రేక్షకులకు కూడా అమృతం పరిచయమవుతుందని టీమ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. యూట్యూబ్‌లో అందుబాటులోకి రావడం వల్ల ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ క్లాసిక్‌ కామెడీని ఆస్వాదించే వీలు కలగబోతున్నది.

Read Also: యువ ఐఏఎస్ అధికారుల నిరాడంబర వివాహం

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>