Mobile Popup Ad
Mobile Popup Ad

నిన్న నోటీసులు.. నేడు విజిట్, అన్నపూర్ణ స్టూడియోకి భట్టి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నపూర్ణ స్టూడియోను సందర్శించారు. ఇటీవల జీహెచ్ఎంసీ అన్నపూర్ణ స్టూడియోకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతలోనే భట్టి స్టూడియోను సందర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది. అక్కినేని నాగార్జున ఆహ్వానం మేరకు భట్టి అన్నపూర్ణ స్టూడియోస్‌(Annapurna Studios)ను సందర్శించారు. స్టూడియో ప్రాంగణంలోని వివిధ సెట్లు, టెక్నికల్ విభాగాలు, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌లో జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలను నిర్వాహకులు ఆయనకు వివరించారు. ఆధునిక చిత్రీకరణ సౌకర్యాలు, విద్యార్థులకు అందిస్తున్న ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌పై భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు.

తరువాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమ ఎదుగుదలలో నాగేశ్వరరావు గారి పాత్ర అపారమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పెద్ద మొత్తంలో ట్రేడ్ లైసెన్స్ బకాయి పెట్టడంతో ఇటీవల జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. 1975లో అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటు చేశారు. ఈ స్టూడియో ఏటా రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది. రూ. 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం రూ. 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ సర్కిల్ 18 అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి భట్టి(Bhatti Vikramarka) సందర్శనతో ఈ ఫీజును మినహాయిస్తారా? ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Read Also: ఛార్జిషీట్‌కు ముందా?.. తర్వాతా?.. కేటీఆర్ అరెస్టుపై ఊహాగానాలు

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>