epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రోడ్డెక్కిన నిరుద్యోగులు.. జాబ్ క్యాలెండర్ విడుదలకు డిమాండ్​

కలం, వెబ్​ డెస్క్​ : ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు (Unemployees) ఏళ్ల తరబడి ప్రిపరేషన్​ కొనసాగిస్తున్నారు. పుట్టిన ఊరును, కన్న తల్లిదండ్రులను వదిలి కోచింగ్​ లపేరుతో పట్టణాలకు వెళ్లి పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఈ క్రమంలో నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానంగా జాబ్ క్యాలెండర్​ ఒకటి. బీఆర్​ఎస్​ గద్దె దిగడానికి.. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు (Unemployees) ముఖ్యపాత్ర పోషించారు.

ప్రభుత్వం ఏర్పడి నెలలు, ఏండ్లు గడిచినా జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదు. గతంలో జాబ్ క్యాలెండర్​ పేరుతో విడుదల చేసిన ఓ పత్రం పక్కకే పోయింది. నిరుద్యోగుల జాబ్​ క్యాలెండర్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో జాబ్​ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు రోడ్డుకెక్కారు .

హైదరాబాద్​ అశోక్​ నగర్​, చిక్కడపల్లి లైబ్రరీ ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు ధర్నా చేపట్టారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళాగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, జాబ్​ క్యాలెండర్​ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ ధర్నా చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తతలు నెలకొనగా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>