కలం, వెబ్‌డెస్క్: అదృష్టం అంటే వీళ్లదే. జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్ అయినా ఆడకుండానే ఐపీఎల్ మినీ వేలం (IPL Auction) లో కోట్లు కొల్లగొట్టారు. అత్యధిక ధర పలికిన టాప్–5 అన్క్యాప్డ్ ప్లేయర్లలో ఆరుగురు నిలవగా, వీరిలో భారత ఆటగాళ్లు ఐదుగురు ఉన్నారు. ఒకరు ఆస్ట్రేలియా ఆటగాడు. వీరిలో ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలను చెన్నై జట్టు చెరో రూ.14.20కోట్లకు తీసుకుంది. పేస్ ఆల్‌రౌండర్ అకిబ్ నబీ దార్(Auqib Nabi Dar)ను రూ.8.40 కోట్లకు ఢిల్లీ తీసుకోగా, మంగేశ్ యాదవ్(Mangesh Yadav)ను రూ.5.20కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. తేజస్వి సింగ్(Tejasvi Singh)ను రూ.3కోట్లకు కేకేఆర్, ఆస్ట్రేలియా ఆటగాడు జాక్ ఎడ్వర్డ్స్‌ను ఎస్ఆర్హెచ్ రూ.3 కోట్లకు దక్కించుకున్నాయి.
కాగా, దుబాయ్‌లో మంగళవారం ఐపీఎల్ వేలం (IPL Auction) అట్టహాసంగా జరిగింది. 370కి పైగా ప్లేయర్లు వేలంలో నిలవగా, 77 మందిని ఆయా జట్లు కొనుగోలు చేశాయి. వీరిలో విదేశీ ప్లేయర్లు 29 మంది ఉన్నారు. అన్ని ఫ్రాంఛైజీలు కలిపి మొత్తం రూ.215.45కోట్లు ఖర్చు చేశాయి. వేలంలో అత్యధిక ధర ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌కు దక్కింది. అతడిని రూ.25.20కోట్లకు కోల్‌కతా దక్కించుకుంది. శ్రీలంక పేసర్ మతీశ పతిరణను రూ.18కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది.
Read Also: కోల్‌కతా ఘటనకు మెస్సీనే కారణం: గవాస్కర్
Follow Us On: Youtube


