epaper
Monday, March 2, 2026
epaper

మూడో విడత పోలింగ్ ప్రారంభం

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) తుది విడత పోలింగ్ ప్రారంభమైంది. బుధవారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ దశలో మొత్తం 53,06,395 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

వీరిలో 26,01,861 మంది పురుషులు, 27,04,394 మంది మహిళలు 140 మంది ఇతరులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36,452 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనున్నది. 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

అయితే, ఇందులో 11 సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 394 సర్పంచి పదవులు ఏకగ్రీవంగా దక్కాయి. 36,452 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది.  తుది విడత పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్టు చేశారు.

Read Also: అన్​క్యాప్డ్​ అ‘ధర’హో!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!