కలం, వెబ్ డెస్క్ : కర్నూలు (Kurnool) జిల్లాలో భారీ మోసం బయటపడింది. ఉమ్రాయాత్ర పేరుతో రూ.4 కోట్లు వసూలు చేశాడు ఓ వ్యక్తి. ఉమ్రాయాత్రకు తీసుకెళ్తానంటూ వెయ్యి మంది దగ్గరి నుంచి రూ.40వేల చొప్పున రూ.4 కోట్లు వసూలు చేశాడు కర్నూలు (Kurnool) జిల్లా పాతబస్తీకి చెందిన వ్యక్తి. కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంతాలకు చెందిన వారి నుంచి ఇలా డబ్బులు వసూలు చేశాడు పాతబస్తీకి చెందిన వ్యక్తి. ఎన్ని సార్లు అడిగినా ఉమ్రాయాత్రకు తీసుకెళ్లకుండా ముఖం చాటేస్తున్నారని బాధితులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు చెబుతున్నారు.
Read Also: పల్నాడు జిల్లా వినుకొండలో దొంగల హల్ చల్
Follow Us On: Youtube

