కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో పలు జిల్లాల్లో దొంగలు (Robbers) రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సమీప ప్రాంతాలు, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ (Vikarabad) తదితర జిల్లాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తున్నారు. లక్షలు విలువైన నగదు, బంగారు నగలు, ఇతర వస్తువులను దొంగిలించుకుపోతున్నారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ (Chain Snatching) సంఘటనలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. మహిళలు, వృద్ధులు లక్ష్యంగా చేసుకుని బైక్‌పై వచ్చి గొలుసులు, మొబైల్ ఫోన్లు అపహరించే సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నప్పటికీ, చోరీలకు చెక్ పడటం లేదు.
గురువారం అర్ధరాత్రి వికారాబాద్ (Vikarabad) జిల్లా చింతామణిపట్నంలో దొంగలు హల్ చల్ చేశారు. వరుసగా ఏడు ఇళ్లల్లో చోరీకి పాల్పడటంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. రెండు ఇళ్లల్లో దాదాపు 2 లక్షల 70 వేల నగదు, బంగారం చోరీకి గురైంది. ఓ కిరాణం షాపులో మద్యం బాటిళ్లు అపహరించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: ‘ఇక్కత్’ రంగుల వెనుక నేతన్నల కన్నీటి వ్యథ
Follow Us On: Instagram

