కాంట్రాక్టర్‌పై అధికారి దాడి.. వీడియో వైరల్

కలం, వరంగల్ బ్యూరో: ప్రభుత్వ అధికారి కాంట్రాక్టర్‌పై దాడి చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో చోటు చేసుకున్నది. బిల్లులు చెల్లించాలని అడిగినందుకు కాంట్రాక్టర్‌పై సదరు అధికారి బూతులు తిట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కలెక్టరేట్‌లోని ఏపీఏవో (APAO) ఫణి భూషణ కశ్యప్ .. కాంట్రాక్టర్ వీరేందర్ మధ్య గత చాలా రోజులుగా వివాదాలు ఉన్నాయి. బిల్లులు క్లియర్ చేసేందుకు కాంట్రాక్టర్లను వేధిస్తుండడంతో సదరు APAOపై గతంలో వీరేందర్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మరోసారి వీరి మధ్య గొడవ జరిగింది. పాత కక్షలను దృష్టిలో పెట్టుకున్న అధికారి తన టేబుల్ మీద వస్తువులతో కాంట్రాక్టర్ మీద దాడి చేశాడు. అతడి మొహంమీద తీవ్రమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Read Also: మహిళా వైద్యుల వేధింపులు.. ఏఎన్ఎం ఆత్మహత్యాయత్నo

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>