కలం, వెబ్ డెస్క్: తమిళనాడులో టీవీకే అధినేత విజయ్‌కు మద్దతుగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ (Congress) నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో కాంగ్రెస్ ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal), జయరాం రమేష్ హాజరయ్యారు. సమావేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఫలితాలు, అనంతర పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ (KC Venugopal) మాట్లాడుతూ.. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని టీవీకే అధినేత విజయ్ కోరారని తెలిపారు. లౌకిక ప్రభుత్వ ఏర్పాటు, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమిళనాడు ప్రజలు తీర్పు నిచ్చారని అన్నారు. తమిళనాడు ప్రభుత్వాన్ని బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ఏ విధంగానూ నడపడాన్ని కాంగ్రెస్ అంగీకరించదని అన్నారు. విజయ్ పార్టీ విజ్ఞప్తిపై తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేశామని వివరించారు.
Read Also: బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్ కు మహిళ సీఎం.. !
Follow Us On : WhatsApp

