Mobile Popup Ad
Mobile Popup Ad

కాశీ టు సీలేరు.. గంజాయి కోసం దూర ప్రయాణం, చివరకు అరెస్ట్​

కలం, ఖమ్మం బ్యూరో: గంజాయికి (Ganja) అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు ఉత్తర్ ప్రదేశ్‌లోని కాశీ నుంచి ఏపీలోని సీలేరు బాట పట్టారు. కాశీలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్న ముత్యం రాము (27), శివాలయం ఘాట్‌లో టాటూలు వేసే రామక్రిష్ణ పవన్ (25) అనే ఇద్దరు యువకులు గంజాయికి అలవాటు పడ్డారు. సీలేరులో గంజాయి తక్కువ రేటుకు దొరుకుతుందని తెలుసుకొని కాశీ నుంచి ఈ నెల 18న హైదరాబాద్‌కు వచ్చారు. ఓ బైక్‌ను రెంట్‌కు తీసుకొని సీలేరుకు వెళ్లారు. అక్కడ 5 ప్యాకెట్ల ఎండు గంజాయిని రూ.28 వేలకు కొనుగోలు చేశారు. తిరిగి హైదరాబాద్‌కు వస్తుండగా కొత్తగూడెం (Kothagudem) వన్ టౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

దాదాపు 10 కేజీల గంజాయి స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 5 లక్షలు. ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ (Kothagudem DSP) ఆదినారాయణ మాట్లాడుతూ యువత గంజాయి కేసుల్లో పట్టుపడుతున్నారని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచాలన్నారు. వారు చెడు మార్గంవైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Read Also: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>