Mobile Popup Ad
Mobile Popup Ad

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈతకు వెళ్లి ఇద్దరి మృతి

కలం, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మరణించిన ఘటన మధ్య మానేరు జలాశయంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం సిరిసిల్ల పట్టణం శాంతినగర్‌కు చెందిన హరిచరణ్ గౌడ్(18), చీర్లవంచ ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన మణికంఠ (17)తో పాటు మరో ముగ్గురు యువకులు ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు. వీరంతా కొడుముంజ గ్రామంలోని రామప్ప ఆలయ సమీపంలో మిడ్ మానేరు జలాశయంలో (Mid Manair Reservoir) ఈత కోసం దిగారు. మణికంఠకు ఈత రాదు. అతడు నీటిలో దిగి కొట్టుకుపోతుండగా హరిచరణ్ గౌడ్‌ గట్టిగా పట్టుకున్నాడు. అతడిని రక్షించే క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు యువకులు చూస్తుండగానే క్షణాల్లో విగత జీవులుగా మారిపోయారు. సమాచారం అందుకున్న వేములవాడ గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. స్థానికుల సహాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

గుండెలవిసేలా రోదించిన కుటుంబసభ్యులు..

అప్పటివరకు తమ కళ్ల ముందే ఉన్న బిడ్డలు.. గంటలోనే విగతజీవులుగా మారిపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. విషాద వార్త తెలియగానే ఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. చేతికి అందివచ్చిన కొడుకులు కళ్లముందే శవాలుగా మారడంతో ఆయా కుటుంబాల్లో గుండెకోత మిగిలింది.

Read Also: ‘కేటీఆర్‌ నోరు అదుపులో పెట్టుకో’ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>