Mobile Popup Ad
Mobile Popup Ad

కాజీపేట మండలంలో విషాదం.. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి

కలం, హనుమకొండ : హనుమకొండ జిల్లా కాజీపేట (Kazipet) మండలం దుంపలగట్టు గ్రామంలో శుక్రవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు వనం సంజన (18), వనం అర్చన (14) నీటి గుంతలో పడి మృతి చెందారు. స్థానిక వివరాల ప్రకారం, పందుల పెంపకమే జీవనాధారంగా ఉన్న ఈ కుటుంబం ప్రతిరోజూ మాదిరిగానే పందులను మేపేందుకు తల్లి శివవాణి, తమ్ముళ్లు గౌతమ్, కార్తీక్‌లతో కలిసి గ్రామ శివారులోని నీటి గుంత వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరు అక్కాచెల్లెళ్లు నీటిలో పడిపోయి మునిగిపోయారు.

సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమార్తెలు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనతో దుంపలగట్టు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

Read Also: పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరనియ్యం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>