కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేతలు పాదయాత్రలు చేసినా.. పొర్లు దండాలు పెట్టినా వాళ్లు చేసిన పాపాలు పోవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. కేసీఆర్ పాలమూరు ప్రాంతం నుంచి ఎంపీగా గెలిపిస్తే ఆయన ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాకు తాను భారీగా నిధులు తీసుకొస్తున్నానని చెప్పారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 22 వేల కోట్లు పెండింగ్ ప్రాజెక్టులకు కేటాయిస్తే.. అందులో 8 వేల కోట్లు పాలమూరు జిల్లాకే ఇస్తున్నానని చెప్పారు. శుక్రవారం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
తెలంగాణ త్యాగం చేసి తెలంగాణ ఇచ్చింది
సోనియా గాంధీ (Sonia Gandhi) దయతో తెలంగాణ వచ్చిందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పునరుద్ఘాటించారు. పాలమూరు జిల్లా వలసలు ఆపాలన్నా మనం బాగుపడాలన్నా ఈ జిల్లా సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్ నేతలు పాదయాత్రలు చేస్తాం.. పొర్లు దండాలు పెడతాం అంటూ డ్రామాలు చేస్తున్నారని.. వాళ్లను ఇక్కడి ప్రజలు తరిమి కొడతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన ఊర్లలో మాత్రమే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.
Read Also: పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరనియ్యం
Follow Us On: Instagram

