Mobile Popup Ad
Mobile Popup Ad

బైక్‌పై గంజాయి స్మగ్లింగ్.. బూర్గంపాడులో ఇద్దరి అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు (Burgampadu) మండలంలో గంజాయి అక్రమ రవాణా గుట్టు రట్టయింది. ఒడిశా రాష్ట్రం నుంచి ములుగు జిల్లాకు బైక్‌పై గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను బూర్గంపాడు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.లక్ష విలువ చేసే గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు ఎస్సై ప్రసాద్ సిబ్బందితో కలిసి సారపాక పల్లె ప్రకృతి వనం సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా వస్తూ పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించగా 2.1 కిలోల గంజాయి లభ్యమైంది. ​విచారణలో నిందితులు ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన బడే భరత్ (20), ఉప్పరపల్లి వెంకటేష్ (26)గా గుర్తించారు. వీరు ఒడిశా నుంచి సొంతూరుకు గంజాయి తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>