పంజాబ్‌లో వరుసగా రెండు భారీ పేలుళ్లు.. భద్రతా దళాలు అలర్ట్

కలం, వెబ్ డెస్క్ : పంజాబ్(Punjab) రాష్ట్రంలో వరుసగా రెండు భారీ పేలుళ్లు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేగింది. జలంధర్ (Jalandhar), అమృత్‌సర్ (Amritsar) ప్రాంతాలలో  జరిగిన ఈ ఘటనలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తొలుత జలంధర్‌లోని బీఎస్ఎఫ్ (BSF) ప్రధాన కార్యాలయం బయట పార్క్ చేసిన స్కూటర్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనతో పరిసర ప్రాంతాలలో  ఆందోళన నెలకొంది. ఇక ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అమృత్‌సర్ జిల్లా ఖాసా ప్రాంతంలోని సైనిక శిబిరానికి సమీపంలో మరో పేలుడు చోటుచేసుకుంది. వరుస పేలుళ్లతో భద్రతా వర్గాలు హై అలర్ట్ ప్రకటించాయి.

పేలుళ్ల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. సంఘటనా స్థలాలకు చేరుకున్న భద్రతా దళాలు, పోలీసులు పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరిస్తున్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో పంజాబ్ (Punjab) వ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యమైన ప్రాంతాలలో  అదనపు బలగాలను మోహరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Read Also: సీఎంగా విజయ్.. రేపు ప్రమాణ స్వీకారం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>