సీఎంగా విజయ్.. రేపు ప్రమాణ స్వీకారం!

కలం, వెబ్‌ డెస్క్‌ : తమిళ వెట్రి కళగం అధినేత విజయ్ (TVK Vijay) రేపు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుక కోసం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ్ ఈరోజు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అనుమతి కోరనున్నారు. 234 స్థానాలున్న అసెంబ్లీలో టీవీకే బలం 108 వద్ద ఉండగా మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకోవడానికి కాంగ్రెస్, పీఎంకే, వామపక్షాల మద్దతును ఆయన కోరారు.

ఇప్పటికే కాంగ్రెస్ నుంచి సానుకూల స్పందన రాగా అన్నా డీఎంకేకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు సైతం విజయ్‌తో (TVK Vijay) టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై అన్నా డీఎంకే అధినేత పళని స్వామి అత్యవసర సమావేశం నిర్వహించి పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించారు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అంశంపై ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఈరోజు సమావేశమై తమ తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది.

Read Also: ట్రంప్‌ కీలక నిర్ణయం.. ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌’కు బ్రేక్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>