Mobile Popup Ad
Mobile Popup Ad

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత: శ్రీనివాసులు

కలం, చండూరు: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని చండూరు (Chandur) మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం చండూరు మున్సిపాలిటీలో “వనమహోత్సవం – 2026 (Vanamahotsavam)” కార్యక్రమములో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, ప్రతి ఇంటి ఆవరణలో పండ్ల, ఔషధ, నీడనిచ్చే మొక్కలను పెంచే లక్ష్యంతో చండూరు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో ఇంటింటికి హోమ్‌స్టెడ్ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రజలు మొక్కలను తమ ఇంటి ఆవరణలో నాటి, వాటిని సంరక్షించి పచ్చని చండూరు నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. మొక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడటమే కాకుండా స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడతాయని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం మాట్లాడుతూ.. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కూడా హోమ్‌స్టెడ్ మొక్కల పంపిణీ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు బుషిపాక వాసు, సామ సుజాతయాదవ రెడ్డి, జెల్ల ధనమ్మ శ్రీనివాస్, కొన్రెడ్డి మధు, కోడి సుష్మ వెంకన్న, కటకం రమేష్ , కో-ఆప్షన్ సభ్యులు మొగుదాల సత్తమ్మ వెంకన్న, షేక్ ఖలీల్, షేక్ సలీమా షరీఫ్, మేనేజర్ జి.రాములు, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభారద్వాజ్, వార్డ్ ఆఫీసర్లు జి.శ్రీరాములు, ఎ.జగన్, బి.సాయిరాం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ యమ్.అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>