ఎదురెదురుగా ఢీకొన్న లారీలు.. ఇద్ద‌రు మృతి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. చంద్రుగొండ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. దీంతో రెండు లారీల క్యాబిన్లు నుజ్జునుజ్జయ్యాయి. డ్రైవర్లు క్యాబిన్లో ఇరుక్కుపోయి మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఛత్తీస్‌గ‌ఢ్‌, మరొకరు తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు. అతివేగం, నిద్ర మత్తు కార‌ణంతోనే ప్ర‌మాదం జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా భావిస్తున్నారు. ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: వెదర్ ఆఫీస్‌లో 14 బాంబులు.. మధ్యాహ్నం డెడ్​ లైన్​!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>