కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. 13 ఏండ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ (Social Media Ban) చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. సోషల్ మీడియా బ్యాన్‌కు సంబంధించి 90 రోజుల్లో విధి విధానాలు రూపొందించబోతున్నట్టు ప్రకటించారు. 13-16 ఏండ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలో వద్దా? అనే విషయంపై త్వరలో చర్యలు తీసుకోబోతున్నట్టు పేర్కొన్నారు.
ఏపీలో కూటమి 15 ఏండ్లు అధికారంలో ఉండాలి..
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో 15 ఏండ్లు అధికారంలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందుకు కూటమి ఎమ్మెల్యేలంతా కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. గుజరాత్‌లో ఎలాగైతే బీజేపీ అధికారంలో ఉందో అలాగే ఏపీలోనూ కూటమి అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. గత ఐదేండ్లలో జగన్ అరాచకాలు చేశారని ఆరోపించారు. 30 ఏండ్ల విధ్వంసం జగన్ పాలనలో సాగిందని విమర్శించారు. కూటమి ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని కోరారు. ఏపీలోని ఆలయాల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు.
Read Also: ఆ వయసులోపు వారికి ఏపీలో సోషల్ మీడియా బ్యాన్
Follow Us On: Youtube

