సెరెనా రీఎంట్రీపై జకోవిక్ ఆసక్తికర వ్యాఖ్యలు !

కలం, వెబ్ డెస్క్: టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ (Serena Williams) మళ్లీ రాకెట్ పట్టబోతున్నారా? అంటే అవుననే అంటున్నారు మరో లెజెండరీ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ (Novak Djokovic). 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన సెరెనా, టెన్నిస్ కోర్టులోకి తిరిగి రావడం ఖాయమని జకోవిచ్ ధీమా వ్యక్తం చేశారు. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2022 యూఎస్ ఓపెన్ తర్వాత సెరెనా మళ్లీ ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడలేదు. అయితే, గత డిసెంబర్‌లో ఆమె తిరిగి ‘యాంటీ డోపింగ్ టెస్టింగ్ పూల్’లోకి చేరడం ద్వారా తన అర్హతను పునరుద్ధరించుకున్నారు.

దీనిపై జకోవిచ్ స్పందిస్తూ.. “ఆమె ఖచ్చితంగా తిరిగి వస్తుందని నా నమ్మకం. అది సింగిల్సా లేదా డబుల్సా అనేది తెలియదు కానీ, ఆమె రాక కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు” అని చెప్పారు. ఒకవేళ తాను సెరెనా (Serena Williams) స్థానంలో ఉన్నా, ఈ విషయాన్ని ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచుతానని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. సెరెనా తన సోదరి వీనస్ విలియమ్స్‌తో కలిసి వింబుల్డన్‌లో డబుల్స్ ఆడే అవకాశం ఉందని జకోవిచ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని అత్యుత్తమ అథ్లెట్లలో సెరెనా ఒకరని, ఆమె మళ్లీ కోర్టులోకి వస్తే టెన్నిస్ అభిమానులకు అంతకంటే కావాల్సింది ఏముంటుందని ఆయన అన్నారు.

మరోవైపు, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ వరకు చేరిన జకోవిచ్, తనలో ఇంకా ఆడే సత్తా ఉందని నిరూపించుకున్నారు. తనకు ఇంకా గెలవాలనే కసి ఉందని, అందుకే మరిన్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఇండియన్ వెల్స్ టోర్నీలో శనివారం జరగబోయే మ్యాచ్‌తో జకోవిచ్ తన వేటను మొదలుపెట్టనున్నారు.

Read Also: బంగ్లాదేశ్‌ జట్టులోకి లిట్టన్ రీ ఎంట్రీ.. పాక్‌తో పక్కా..!

Follow Us On: X(Twitter)

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>