కలం, వెబ్‌డెస్క్: గల్ఫ్ దేశం కువైట్ (Kuwait) లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష పడింది. భారీ మొత్తంలో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వీళ్లకు అక్కడి న్యాయస్థానం ఈ కఠిన శిక్ష విధించింది. కువైట్‌లోని కైఫాన్, షువైక్ ఏరియాల్లో నివసించే వీరి నుంచి 1కేజీల హెరాయిన్, 8కిలోల మెథాంఫెటమైన్‌ను స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ ఇద్దరూ అంతర్జాతీయ మాఫియా ముఠాలో సభ్యులని పోలీసులు గుర్తించారు. అనంతరం వీరిని స్థానిక క్రిమినల్ కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షాధారాలను పరిశీలించిన అనంతరం జడ్జి ఖలేద్ అల్ తహౌస్ నిందితులకు మరణశిక్ష విధించింది. నిందితులు ఏ రాష్ట్రానికి చెందినవాళ్లో వివరాలు వెల్లడించలేదు. కాగా, గల్ఫ్ కంట్రీస్‌లో మత్తు పదార్థాలు, మద్యం వంటి వాటిపై నిషేధం ఉంటుంది. ఎవరైనా పట్టుబడితో శిక్షలు కఠినంగా ఉంటాయి.
Read Also: రోడ్డెక్కిన నిరుద్యోగులు.. జాబ్ క్యాలెండర్ విడుదలకు డిమాండ్
Follow Us On : WhatsApp


