కలం, వెబ్ డెస్క్ : చైనా మాంజా (Chinese Manja)పై సిటీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా మాంజాను కొనుగోలు చేసినా, అమ్మినా, వాడినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ భారీగా నిషేదిత మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడుతూ, చైనా మాంజాతో గాలిపటాలు ఎగరేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే చైనా మాంజా కారణంగా ఎవరికైనా గాయాలు జరిగితే, బాధ్యులపై అదనపు కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. అవసరమైతే చైనా మాంజా విక్రయించే వారిపై పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్) కూడా ప్రయోగించే ఆలోచన చేస్తున్నట్లు సజ్జనార్ హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: పరిహారం కోసం ఇండ్లు కడుతున్నారు..!
Follow Us On: Youtube


