కలం, వరంగల్ : భూపాలపల్లి (Bhupalpally)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం, రెండు రోజుల క్రితం కాటారం డివిజన్ పరిధిలోని ఒక మండలానికి చెందిన చిన్నారి ఇంటివద్ద ఆడుకుంటుండగా, పక్కనే ఉన్న పార్క్ దగ్గరకు తీసుకెళ్లి ఇద్దరు బాలురు ఆమెపై దాడి చేశారు. అస్వస్థతకు గురైన చిన్నారిని తల్లిదండ్రులు గమనించి ఆస్పత్రికి తరలించారు, ఆ సమయంలో లైంగిక దాడి విషయం బయటపడింది. బాధిత కుటుంబం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు నిందితులపై పోక్సో చట్టం (POCSO Case) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: రాబోయే కొద్ది రోజుల్లో భూధార్ కార్డులు అందజేస్తాం: పొంగులేటి
Follow Us On: Instagram

