లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

కలం, వెబ్ డెస్క్: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) తప్పుకున్నాడు. ఈ మేరకు జట్టు యాజమాన్యం ప్రకటించింది. ‘కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు రిషభ్ పంత్ కోరాడు. అతడిపై గౌరవంతో మేం వెంటనే ఈ నిర్ణయాన్ని ఆమోదించాం. ఇది చాలా కఠినమైనదే అయినప్పటికీ, రిషభ్ పంత్ కెప్టెన్‌గా అందించిన సేవలకు మేం ఎప్పటికీ ధన్యవాదాలు చెబుతాం. అందరూ కలిసికట్టుగా.. జట్టును ఉన్నత స్థానానికి ఎలా చేర్చాలనేదే మా ముందున్న లక్ష్యం’ అని LSG ఆ ప్రకటనలో పేర్కొంది.

వరుస ఓటములతోనే..

మెగా వేలంలో రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరతో రిషభ్ పంత్‌ను (Rishabh Pant) కొనుగోలు చేసిన LSG.. కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. అయితే, టోర్నీ ఆద్యంతం పంత్ ఏమాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాడు. వరుస ఓటములు, ఫ్లే ఆఫ్ అవకాశాలు సంక్షిష్టం కావడంతో మానసికంగా ఇబ్బంది పడ్డాడు. “ఇది కఠినమైన సీజన్” అంటూ ఇటీవల ఓ వీడియోలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. తన ఆటపై కెప్టెన్సీ తీవ్ర ప్రభావం చూపుతోందని గ్రహించిన పంత్.. ఇక నుంచి బ్యాటర్‌గానే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కొత్త కెప్టెన్ రేసులో నికోలస్ పూరన్, మార్‌క్రమ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

Read Also: ప్రేయసిని కలవడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఫిట్‌నెస్ ట్రైనర్

Read Also: పెట్రో బాదుడు పాపం తలా పిడికెడు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>