కలం, వెబ్ డెస్క్: మెగా డీఎస్సీ (Mega DSC) నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) డిమాండ్ చేశారు. శుక్రవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతానని చెప్పారని అంబటి రాంబాబు గుర్తు చేశారు.
ఈ మెగా డీఎస్సీ కాస్తా ఇప్పుడు దగా డీఎస్సీ అయ్యిందని ఆరోపించారు. పేపర్ లోడింగ్‌లో భాగస్వామ్యం అయిన కృష్ణా జిల్లాకు నవీన్‌కు డీఎస్సీలో మొదటి ర్యాంక్ వచ్చిందన్నారు. మొదటి ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఈ విషయంపై అతను కోర్టు వరకు వెళ్లాడని వెల్లడించారు. పరీక్షల్లో భాగమైన వ్యక్తికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చిందని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు మహానాడులో గొంతు చించుకొని పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించామని చెప్తున్నారని, పారదర్శకత ఎక్కడ కనిపిస్తోందని ప్రశ్నించారు.
16 వేల పోస్టులు ఉంటే 3 శాతం చొప్పున 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో కేటాయించారన్నారు. మంత్రి నారా లోకేశ్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లను రూ.10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. ఆటలు అంటే ఏమిటో కూడా తెలియని వారికి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ఇది అత్యంత దుర్మార్గమైన పని అని విమర్శించారు. మెగా డీఎస్సీలో పోస్టులు అమ్ముకున్నారని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు దీనిపై విచారణ కోరుతూ ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. దీనిపై అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపామన్నారు. మంత్రి లోకేశ్‌కు సిగ్గుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీపై సీబీఐ ఎంక్వైరీ వేసి క్లీన్ చిట్ తీసుకోవాలన్నారు. చంద్రబాబుతో పాటు, లోకేశ్ దోపిడీకి బాగా అలవాటు పడ్డారని అంబటి (Ambati Rambabu) విమర్శించారు.
Read Also: లిక్కర్ కేసులో జగన్‌కు శిక్ష తప్పదు: కొమ్మారెడ్డి పట్టాభిరామ్
Follow Us On : WhatsApp

