కలం, మెదక్ బ్యూరో : ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి (MLC Anji Reddy) బొల్లారం డివిజన్ (Bollaram Division) లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లా బొల్లారం ప్రాంతంలో జీహెచ్ఎంసీ (GHMC) అధికారులతో కలిసి ఆయన మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలలో తిరుగుతూ స్థానిక ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బొల్లారం లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ ఓవర్‌ఫ్లో సమస్యపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో, వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
మార్నింగ్ వాక్ సమయంలో గుర్తించిన సమస్యలపై వారంలోగా తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పరిష్కరించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) సూచించారు. ప్రభుత్వ అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. బొల్లారం డివిజన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. ప్రతి వారం ఒక రోజు మార్నింగ్ వాక్ ద్వారా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీసీ ప్రదీప్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Also: ట్రంప్ కీలక నిర్ణయం.. ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’కు బ్రేక్!
Follow Us On : WhatsApp

