కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) ప్రజలకు ఊరటనిచ్చేలా ఉల్లిపాయల ధరల నియంత్రణకు ముమ్మర చర్యలు చేపట్టింది. బహిరంగ మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో, సామాన్యులపై భారం పడకుండా మహారాష్ట్రలోని నాసిక్ నుంచి దాదాపు 800 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ఏపీకి దిగుమతి చేసుకుంటోంది.
రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను కేవలం రూ.35కే సబ్సిడీ ధరకు అందుబాటులో ఉంచనుంది. మార్కెట్ ధరల తీవ్రత తగ్గే వరకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో ఈ విక్రయాలు నిరంతరం కొనసాగుతాయి.

