పల్లెల్లో డిజిటల్ వెలుగులు: కేంద్రం, టీ-ఫైబర్ కీలక ఒప్పందం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ విప్లవాన్ని చేరువ చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ డిజిటల్ కనెక్టివిటీ అందించి, గ్రామీణ ప్రజలకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావడానికి టీ-ఫైబర్‌ (T-Fiber) ప్రాజెక్టు ద్వారా అడుగులు వేగవంతమయ్యాయి. ఈ బృహత్తర ప్రాజెక్ట్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,185 కోట్ల ఆర్థిక సాయాన్ని మంజూరు చేస్తూ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.93 లక్షల గ్రామీణ కుటుంబాలకు నేరుగా ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్లు అందించనున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ నెట్‌వర్క్ మౌలిక వసతులను వేగంగా విస్తరించేందుకు గాను ఒక్కో గ్రామీణ కనెక్షన్‌కు రూ.10 వేల చొప్పున కేంద్రం ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ నిధుల సాయంతో గ్రామాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సాధారణ పౌరులకు కూడా నాణ్యమైన వేగవంతమైన డిజిటల్ సేవలు అందనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>