తమిళనాడులో టీవీకే ముందంజ.. అస్సాంలో బీజేపీ హవా

కలం, వెబ్ డెస్క్ : 4 రాష్ట్రాలు సహా ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections Results 2026) ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరిలో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయింది. ఈ క్రమంలో తమిళనాడులో టీవీకే అనూహ్య రీతిలో ముందుకు దూసుకెళ్తోంది. అధికార డీఎంకేని వెనక్కి నెట్టిన విజయ్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీవీకే పార్టీ 90 సీట్ల లీడ్ లో ఉండగా డీఎంకే 48,  ఏఐఏడీఎంకే 54 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరో వైపు టీవీకే పార్టీ చీఫ్ విజయ్ దళపతి పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు చోట్లో లీడ్ లో కొనసాగుతున్నారు.

ఇక అస్సాం అసెంబ్లీ సీట్ల ఓట్ల కౌంటింగ్ లో హెమంత్ బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) నేతృత్వంలోని అధికార బీజేపీ పార్టీ హవా కొనసాగిస్తోంది. ఎన్డీఏ మిత్ర పక్షం 85 సీట్లతో ముందు వరుసలో ఉండగా కాంగ్రెస్ 25 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలాగే, బెంగాల్ లో ఇప్పటి వరకు 74 సీట్లతో కాషాయం పార్టీ ఉరకలెత్తుతోంది. టీఎంసీ 63 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాగా, ఫలితాలపై మధ్యాహ్నం వరకు ట్రెండ్ ఫలితాలపై క్లారిటీ రానుంది.

Read Also: సినీ తారలకే తమిళ తంబీలు పట్టాభిషేకం.. ఎంజీఆర్ నుంచి విజయ్ దాకా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>