కలం, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ అరంగేట్రం చేసిన తొలి ఎన్నికల్లోనే నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (Vijay TVK) ప్రభంజనం సృష్టిస్తోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం టీవీకే సుమారు 100 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అధికారం దిశగా దూసుకుపోతుండగా, AIADMK రెండో స్థానంలో నిలిచింది. అధికార డీఎంకే అనూహ్యంగా వెనుకబడిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఫలితంగా పలు ప్రాంతాల్లోని డీఎంకే కార్యాలయాలు సందడి లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోగా, తమిళ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలుకాబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read Also: తమిళనాడు ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

