దివ్యాంగుల సెల్ వనపర్తి కన్వీనర్‌గా నర్సోజి

కలం, వనపర్తి: బీజేపీ వనపర్తి జిల్లా దివ్యాంగుల సెల్ (BJP Divyang Cell) నూతన కమిటీని నియమించారు. జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ ఆదేశాల మేరకు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సబిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పన సమక్షంలో రాష్ట్ర దివ్యాంగుల సెల్ కో-కన్వీనర్ బెస్త యాదగిరి నియామక పత్రాలను అందజేశారు. జిల్లా దివ్యాంగుల సెల్ కన్వీనర్‌గా జగత్కరి నర్సోజి, కో-కన్వీనర్‌గా గొల్లబోయ సుశీలను నియమించారు.

ఈ సందర్భంగా నూతన బాధ్యులను నాయకులు శాలువాలతో సత్కరించి అభినందించారు. దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేరవేయాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తామని నూతన బాధ్యులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>